30 June, 2026 | 10:07 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

16-03-2026 01:16 AM

మేడ్చల్, మార్చి 15(విజయ క్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి డివిజన్లోని హనుమాన్ నగర్ జెడ్ టి. సి గ్రౌండ్ వద్ద సుమారు రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, దీర్ఘకాలంగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే అధికారుల తో చర్చించి, రైల్వే స్థలం గుండా వెళ్లే డ్రైనేజీ మార్గానికి అనుమతి పొందడం ద్వారా ఈ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు.

అదేవిధంగా కేసీఆర్ బస్తీ, పీఎన్‌ఆర్ కాలనీ, నాన్న హిల్స్ వంటి ఎత్తున ప్రాంతాలకు మంచినీటి సరఫరా సక్రమంగా అం దించేందుకు జలమం డలి ద్వారా బూస్టర్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ బూస్టర్ ద్వారా ఎత్తున ప్రదేశాలకు కూడా నీరు సులభంగా చేరే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పా రు. అనంతరం జలమండలి అధికారులతో కలిసి బూస్టర్ ఏర్పాటును ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్, డీజీఎం విద్యాసాగర్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అమీరుద్దీన్, మురుగేష్, ఇబ్ర హీం, ఉస్మాన్, నవాబ్, సం తోష్ గుప్తా, ఆదినారాయణ, గణేష్, మారుతి ప్రసాద్, ఉషా శ్రీ,రాణి, పర్వీన్ తదితరులు, స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.