24 March, 2026 | 11:34 PM

వివో భవనాలకు భూమిపూజలు

24-03-2026 10:03 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలంలోని గొట్టిముక్కుల, అంబారిపేట్, దోమకొండ గ్రామపంచాయతీలలో వివో భవనాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. సంబంధిత సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, దోమకొండ సర్పంచ్ ఐరేణి నర్సయ్య, గొట్టిముక్కుల సర్పంచ్ సంజీవ్, అంబారిపేట్ సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ పాల్గొన్నారు. అలాగే ఉప సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, డ్వాక్రా మహిళలు, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.