19 March, 2026 | 1:10 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

గెస్ట్ ఫ్యాకల్టీలను రెన్యూవల్ చేయాలి

09-08-2024 12:42 AM

ఇంటర్ బోర్డు కార్యదర్శిని కోరిన అధ్యాపకులు

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): గెస్ట్ లెక్చరర్ల రెన్యూవల్‌ను పొడిగించి వారిని మల్టీజోన్‌లో ఎక్కడ అవకాశం ఉన్నా కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సురేష్ కోరారు. ఈమేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శిని గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల బదిలీల్లో డిస్టర్బ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు తిరిగి వేరే కళాశాలకు అవకాశం కల్పించాలని, సాధారణ బదిలీల్లో అవకాశం రాని అధ్యాపకులకు దరఖాస్తు చేసుకోవడానికి పోర్టల్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రజియా సుల్తానా, లింగమూర్తి, గణపతి, రాజిరెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.