12 July, 2026 | 5:47 PM

Breaking News

ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •  

పాకిస్థాన్‌లో ముష్కరుల కాల్పులు: 23 మంది మృతి

26-08-2024 12:35 PM

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో ముష్కరులు రెచ్చిపోయారు. ముష్కరుల కాల్పుల్లో 23 మంది మృతి చెందారు. బలూచిస్థాన్- పంజాబ్ జాతీయరహదారిపై ముష్కరులు వాహనాలను ఆపారు. బస్సులు, ట్రక్కుల్లో వెళ్తున్న వారిని ముష్కరులు బలవంతంగా దింపారు. అక్కడితో ఆగకుండా  విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 23 మంది చనిపోయారు. ముష్కరుల కాల్పుల్లో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో 19 మంది పాక్ పంజాబీలు, ముగ్గురు బలూచిస్థాన్ వాసులున్నట్లు గుర్తించారు. మృతుల్లో అధికంగా పాక్ పంజాబీ కూలీలు ఉన్నట్లు తెలిసింది. ముష్కరులు.. ప్రయాణికుల వర్గం ఆరా తీసినట్లు పాకిస్థాన్ అధికారి వెల్లడించారు.