15 May, 2026 | 9:57 PM

Breaking News

ప్రకటించిన గంటలోపే.. అభ్యర్థుల తొలి జాబితాను తొలగించిన బీజేపీ

26-08-2024 12:49 PM

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో జరిగే ఎన్నికలకు 44 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బిజెపి నేడు విడుదల చేసింది. అయితే వెంటనే దానిని తొలగించింది. త్వరలోనే తాజా జాబితా వెలువడే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ఉదయం ప్రకటించిన జాబితాలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. తమ అజెండా ఒప్పకుంటే కూటమికి మద్దతు ఇచ్చేందుు రెడీగా ఉన్నామని ముఫ్తీ తెలిపారు. 

ఇప్పుడు తొలగించబడిన జాబితాలో ముగ్గురు కీలక పేర్లు లేవు. జమ్మూ కాశ్మీర్ బిజెపి అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, వీందర్ గుప్తా. ఈ జాబితాలో నేషనల్ కాన్ఫరెన్స్ నుండి మారిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోదరుడు దేవేంద్ర రాణా పేరు ఉంది. తొలి జాబితాలో ఇద్దరు కాశ్మీరీ పండిట్‌లు 14 మంది ముస్లిం అభ్యర్థుల పేర్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి పాంథర్స్ పార్టీకి చెందిన పలువురు మాజీ నాయకులు, పార్టీ మారిన  బిజెపిలో చేరిన వారు కూడా ఇప్పుడు తొలగించబడిన జాబితాలో ఉన్నారు.