27 July, 2026 | 2:38 AM

28 నుంచి దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయంలో గురు పూర్ణిమ మహోత్సవం

27-07-2026 02:07 AM

ఎల్బీనగర్, జూలై 26 : దక్షిణ భారతదేశ షిరిడిగా ప్రసిద్ధి చెందిన దిల్ సుఖ్ నగర్ లోని  శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో సంస్థాన్  ట్రస్ట్ ఆధ్వర్యంలో 28 నుంచి 30వ తేదీ వరకు గురుపూర్ణిమ మహోత్స వాలు నిర్వహించనున్నట్టు సాయిబాబా ట్రస్ట్  చైర్మన్ లింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయి నామ నగర సంకీర్తనలు, శ్రీ సాయిలక్ష నామార్చన తోపా టు 108 వెండి కలశాలతో సాయి బాబాకి పవిత్ర నదీ జలాలు, పంచామృతాలతో అష్టోత్తర శతకలాభిషేకం నిర్వహించనున్న ట్టు తెలిపారు. కార్యక్రమంలో జనరల్ సెక్రట రీ రవికుమా ర్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ శ్యామ్ కుమార్, ట్రస్టు మాజీ చైర్మన్లు మల్ల య్య, యాదయ్య, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.