27 July, 2026 | 1:04 AM

ఇందిరమ్మ ఇల్లు.. ఆగింది ఆఖరి బిల్లు!

27-07-2026 12:31 AM
  1. నిర్మాణ వ్యయం పెరిగినా ఇండ్లు పూర్తి చేసిన వైనం
  2. ఆఖరి దఫా బిల్లు రాకపోవడంతో అయోమయంలో లబ్ధిదారులు
  3. ఆఖరి బిల్లులను విడుదల చేయాలనీ వేడుకొలు 

వేములపల్లి, జూలై 26 : నిరుపేదల సొం తింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం అమలు చేస్తుంది. మిర్యాలగూడ నియోజకవర్గానికి 3000 మంజూ రు అయ్యాయి. కాగా వేములపల్లి మండలంలో మొత్తం 659 ఇండ్లు కేటాయించారు. వీటిలో కొన్ని స్లాబ్ లెవల్ లో ఉండగా మరికొన్ని ఇల్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులు ఇ ల్లు కట్టుకున్న వెంటనే బిల్లులు ఇస్తామని ప్ర భుత్వ పెద్దలు చెబుతున్న క్షేత్రస్థాయిలో మా త్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

ప్రభు త్వ నిబంధనల ప్రకారం నాలుగు విడతల్లో బిల్లులు ఇస్తుండగా, ఆఖరి బిల్లు మాత్రం రావడంలేదని లబ్ధిదారులు ఆందోళన చెం దుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు చివరి బిల్లులు నిలిచిపోయాయి. బేస్మెంట్ రూప్ స్లాబ్ లెవెల్ వరకు మూడు విడతల్లో నాలుగు లక్షల రూపాయలు అందిన చివరి విడత లక్ష రూపాయలు రా వాల్సి ఉంది. అప్పోసప్పో చేసి ఇళ్ల నిర్మాణా లు పూర్తి చేసిన లబ్ధిదారులు చివరి బిల్లు కో సం ఎదురుచూడాల్సి వస్తుంది. ఇల్లులు ని ర్మించి నెలలు గడుస్తున్న బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతుందని వాపోతు న్నారు.

పెరిగిన ఇంటి నిర్మాణ వ్యయం

ఇందిరమ్మ పథకంలో భాగంగా ప్రభు త్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుందనే ధీమాతో పిల్లనిర్మానాలు ప్రారంభించిన లబ్ధిదారులకు అమెరికా ఇరాన్ యుద్ధంతో సిమెంట్ స్టీల్ ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారు. అప్పు చేసుకుని ఇల్లు నిర్మించిన వారికి చివరి బిల్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 

అంతా బాగున్న. ఆఖరులోనే

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులు ఇంకాస్త మెరుగ్గా నిర్మించుకునేలా కొద్దో గొప్పో అప్పు చేస్తున్నారు. మా ర్కింగ్, పునాదులు, గోడలు, స్లాబ్ దశల్లో ప్రభుత్వం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సరిగ్గానే నగదు జమవుతుంది. కానీ చివరి బిల్లు మాత్రం అందలేదు. అసలే అప్పుచేసి ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు చివరి బిల్లు లక్ష రూపాయలు ఆగిపోవడంతో ఏం చేయాలో పోలుపోనీ స్థితిని ఎదుర్కొంటున్నారు.

దీంతో చిన్నపాటి పనులు చేపట్టి ఇల్లు ప్రారంభించుకోవాలనుకున్న వారికి కాలయాపన తప్పడం లేదు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జోరుగా సాగుతోంది. ఈ విడతలో ఇల్లు లేని వారితో పాటు పూరి గుడిసెలో ఉన్న వారికి ప్రాధా న్యం ఇస్తున్నారు. అయితే మొదటి విడతలో ఇల్లు నిర్మించుకున్న వారికి పూర్తిస్థాయిలో బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి జంకుతున్నారు. 

ఆందోళన చెందవద్దు

ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఆఖరి బిల్లు కోసం ఆందోళన చెందవద్దు. మండలం లో 159 ఇండ్లు ఇండ్లు స్లాబ్ లెవల్ లో ఉన్నాయి. పూర్తయిన ఇండ్లకు రూ. 1,20,000 మంజూరు కావాలి. నివేదికను ప్రభుత్వానికి పంపించాం. చివరి బి ల్లు కేంద్రం డైరెక్టుగా లబ్ధిదారుల ఖాతా ల్లో వేస్తుంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుంది .త్వరలో చివరి బిల్లు వచ్చే అవకాశం ఉంది.

సంకీర్తన ఏ ఈ,