calender_icon.png 28 January, 2026 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హబీబ్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్’

28-01-2026 12:00:00 AM

కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో ప్రారంభించిన నటి సుప్రియ చావన్ 

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): అందం, ఆకర్షణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారాయని వర్ధమాన నటి సుప్రియ చావన్ అన్నారు. ఢిల్లీ ఆధారిత వెల్నెస్ చైన్ కూకట్‌పల్లిలోని వివేకానం దనగర్‌లో నెలకొల్పిన హబీబ్స్ హెయిర్ అండ్ బ్యూటీ తెలంగాణ 27వ సెలూన్ బ్రాంచీని నటి సుప్రియ చావన్‌తో పాటు హబీబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమన్ హబీబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రియ చావన్ మాట్లాడుతూ..

అందం ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుందని, జాతీ య, అంతర్జాతీయ సెలూన్ బ్రాండ్లు ఒకప్పుడు ఎంతో ఖరీదుతో పాటు పరిమితంగా ఉండేవని, ఇప్పుడు ఈ సౌందర్య పోషక సేవలు   ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వ చ్చాయన్నారు. 2027 మార్చి నాటికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 20కి పైగా హబీబ్స్ సెలూన్లను ఏర్పాటు చేయనున్నట్లు హబీబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమన్ హబీబ్, మాస్టర్ ఫ్రాంచైజీలు ప్రశాంత్ లడ్డా, శ్రీకాం త్ రాఠి బృందం పేర్కొన్నారు.

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అమీన్పూర్, బాచుపల్లి ప్రాంతాలతో పాటు వరంగల్, కరీంనగర్ నగరాల్లో కొత్త సెలూన్లను ప్రారంభించనున్నట్లు వారు వివరించారు. ఈ రం గంలో మహిళా యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఫ్రాంచైజీ అవకాశాలను కూడా అందిస్తున్నామని తెలిపారు.