22 March, 2026 | 1:38 AM

భద్రాద్రి జిల్లాలో వడగళ్ల వాన

22-03-2026 12:07 AM

265 ఎకరాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 21 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్ర వారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన పంటలకు తీవ్ర నష్టం చేసింది. జిల్లాలోని పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో చేతికి వచ్చిన మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి.

పాల్వంచ మండల పరిధిలోని ఉల్వ నూరు, రేగులగూడెం, చంద్రాలగూడెం, బం జర మల్లారం, కోడిపుంజులవాగు, పేటచెరువు, లక్ష్మీదేవి పల్లె మండల పరిధిలోని ఉమ్మడి రేగళ్ల పంచాయతీలోని పలు గ్రా మాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రాథమిక సమాచారం ప్రకారం రెండు మండలా ల్లో మొత్తం ఏడు గ్రామాల పరిధిలో 265 ఎకరాల్లో 190 మంది రైతులకు పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వం స్పందించి నష్ట పో యిన రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా వడగళ్ల వాన కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంట నష్టాని కి రైతులకు తక్షణమే పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని కొత్తగూడెం ఎ మ్మెల్యే సాంబశివరావు హామీ ఇచ్చారు.