30 June, 2026 | 10:35 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

వడగండ్ల వాన బీభత్సం

13-04-2025 06:15 PM

చిల్పూర్,(విజయ క్రాంతి): జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతి పల్లి గ్రామంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలుల వీచడంతో చెట్లు కూలిపోయాయి. చేతికొచ్చిన వరి పంటలు నేలవాలాయి, మామిడి కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. మండలంలోని పలు గ్రామాలలో ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వానకు  చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.  ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సానికి పొట్టకొచ్చిన వరి చేన్లు దెబ్బతిన్నాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.