సర్వీస్ రోడ్డు సగం ఖతం!
సరూర్‌నగర్, జూన్ 5 (విజయక్రాంతి)ః సర్వీస్ రోడ్దు ఇరువైపులా సగానికి పైగా వాహనాల పార్కింగ్‌కు, చిరు వ్యాపారుల ్రఆకమణకు గురవుతోంది. దీంతో రోడు స్థలం పూర్తిగా కుచించుకుపోయి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చంపాపేట చౌరస్తా నుంచి నేరుగా నేషనల్ హైవే మార్గానికి బయలుదేరి వెళ్లే 60 ఫీట్ల రోడులో ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్క్‌చేసి ఆక్రమించడం, మరో పక్క రోజుకు ఓ కొత్త చిరు వ్యాపారం పేరుతో రోడ్దు స్థలం సగానికి పైగా ఆక్రమణకు గురవుతోంది.
ఇలాంటి ఆక్రమణలతో 60 ఫీట్ల రోడు 20 ఫీట్లకు కుచించుకుపోయి ఓ కాలనీ వీధి రోడులా దర్శణమిస్తుంది. దీంతో ఆ రోడు మార్గంలో నిత్యం ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులతో ప్రయాణీకులు సతమతమవుతంటే ఇందుకు తోడూ ఈ రోడు మార్గానికి ఇరువైపుల ఉండే వ్యాపార దుకాణాదారులు సైతం కొంత రోడు స్థలాన్ని ఆక్రమించి అ స్థలాలను చిరు వ్యాపారులకు కిరాయికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రోడు పరిస్థితి ఇలా మారడానికి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులే కారణమని వారి వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ రోడ్డులో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తారో, లేదో వేచి చూడాల్సిందే.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రోడ్డే పార్కింగ్ స్థలం
చంపాపేట చౌరస్తా నుంచి నేషనల్ హైవే రోడు పక్కన ఓ అద్దె భవన్‌లో గత ఎప్పటి నుంచో భూముల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కొనసాగుతుంది. కానీ అ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి, అక్కడ ఉండే డాక్‌మెంట్ రైటర్స్ వద్దకు వచ్చే వారి వాహనాల నిలుపుదలకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో వారి వాహనాలు ఈ రోడుకు ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ పార్క్‌చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెలుతారు. వారి పనులు ఎప్పుడు ముగిస్తే అప్పుడొచ్చి వాహనాలను తీసుకు వెలుతారు.
ఇప్పటికే రోడు సగానికి పైగా అక్రమణకు గురై ప్రయాణికులు రాక, పోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మొర్రోని వారు ఆవేదన చెందుతుంటే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చేవారి వాహనాలు కూడా రోడును ఆక్రమించి పార్క్ చేయడంతో ఈ రోడు సమస్యతో ప్రయాణికులకు మరిన్ని ఇబ్బందులు తోడయ్యాయని అటుగా వెళ్లే ప్రయాణికులు వారి ఆవేదనను వెలుబుచ్చుతున్నారు.






