చెరువులను ఆధునికీకరిస్తాం
06-06-2024 12:37 AM
రాజేంద్రనగర్, జూన్ 5: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చెరువులను ఆధునికీకరిస్తామని కార్పొరేషన్ మేయర్ లతా ప్రేమ్‌గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కార్పొరేషన్ పరిధిలోని హైదర్‌షాకోట్ ఎర్రకుంటలో పూడికతీత పనులు చేపట్టగా, వారు పనులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలోని అన్ని చెరువులపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. చెరువును సాధ్యమైనంత త్వరగా ఆధునికీకరించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు టింకురెడ్డి, మాజీ ఎంపీటీసీ రవికాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






