3 April, 2026 | 2:44 AM

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

03-04-2026 12:55 AM

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన వేలాది భక్తుల కోసం ఆలయ కమిటీ సభ్యు లు ధర్మపురి వెంకటేశ్వర్లు, గుండా వెంకన్న, వివేక్, మధు తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు శిరీష్ శర్మ, నిమ్మకంటి సంతోష్ శర్మ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్ నాయకురాలు సరస్వతి, రాజంపేట ఉపసర్పంచ్ మామిడి లక్ష్మి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలకు భారీగా తరలివచ్చిన భక్తులకు సాయిని సంతోష్ ఆధ్వ ర్యంలో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ తరఫున తాగునీటి పంపిణీ చేశారు.