14-11-2025 07:37:32 PM
చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ వేషాధారణలో అలరించారు. అనంతరం ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం అని, అభం శుభం తెలియని ఆ పసి మనసులు ఉన్న పిల్లలు అంటే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎంతో ఇష్టపడే వారిని, అందుచేత ఆయన పుట్టిన రోజునే ఏటా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం అని తెలియజేశారు.