calender_icon.png 14 November, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

14-11-2025 07:35:22 PM

మందమర్రి,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంతో పట్టణం లోని పాత బస్టాండ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి, ఘనంగా సంబరాలు నిర్వ హించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్  పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా నాయకుడు సోత్కు సుదర్శన్ లు మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబెట్టారన్నారు. రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకట స్వామి జూబ్లీహిల్స్ నియోజక వర్గం ఇంచార్జ్ గా వ్యవహరించి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేశారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విశేషంగా తీసుకుపోయి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించ డంలో కీలకపాత్ర పోషించార అని న్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు  రాష్ట్ర మంత్రులు డాక్టర్ గడ్డం వివేక వెంకట్ స్వామి, పొన్నం ప్రభాకర్ గౌడ్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లు విశేష కృషి చేశారన్నారు.