4 March, 2026 | 5:21 AM

జిల్లా ప్రజలకు, పోలీసు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు

04-03-2026 12:00 AM

జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే

రాజన్న సిరిసిల్ల, మార్చి3 (విజయ క్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భం గా ఎస్పీ జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ,

హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం,ఐక్యత,కోత్త ఉత్సాహం,వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.పోలీసు కుటుంబంలో స్నేహభావం, ఐక్యత మరింత బలపడేలా ఈ వేడుకలు ని ర్వహించబడినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.