14-01-2026 07:22:20 PM
మాజీ కార్పొరేటర్ నిహారిక వెంకట్ గౌడ్
జవహర్ నగర్,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ తో కలిసి మాజీ కార్పొరేటర్ నిహారిక వెంకట్ గౌడ్ బుధవారం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ నివాసానికి వెళ్లి బోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ జవహర్ నగర్ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.
అదే విధంగా వారిని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ వారిని శాలువాతో సత్కారించి పుష్ప గుచ్ఛమ్ అందజేశారు.అదే విధంగా మాజీ కార్పొరేటర్ నిహారిక వెంకట్ గౌడ్ లు, విజయంక్రాంతి ప్రతినిధితో మాట్లాడుతూ ప్రజలంతా ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ , అందరి జీవితాలలో సంతోషాల విజయక్రాంతి నింపాలని నవ్వుతూ అన్నారు.