calender_icon.png 14 January, 2026 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమకొండను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి

14-01-2026 07:08:29 PM

దోమకొండ సర్పంచ్ ఐరేణి నరసయ్య

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాత తాలూకా అయిన దోమకొండను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేలా కృషి చేయాలని బుధవారం దోమకొండ సర్పంచ్ ఐరేణి నరసయ్య ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని ఆయన నివాసంలో కలసి వినతి పత్రం అందజేశారు. దోమకొండ గతంలోనే సమితిగా, తాలూకాగా కొనసాగిందని దోమకొండకు ఒక చరిత్ర ఉన్నట్లు వివరించారు. ఇన్చార్జి మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి దోమకొండను రెవెన్యూ డివిజన్ గా  ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని  వినతి పత్రంలో కోరారు.

అలాగే ఈనెల 30న దోమకొండలో నిర్వహించే ఊర పండగ కార్యక్రమానికి  హాజరుకావాలని కోరుతూ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రాష్ట్ర నాయకులు ఇలియాస్ కు  మర్యాదపూర్వకం కలిసి విన్నవించారు. ఊర పండుగకు ఇంచార్జ్ మంత్రి సీతక్క హాజరయ్యేందుకు కృషి చేయాలని షబ్బిర్ అలీ తో  కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ పార్టీ టౌన్  అధ్యక్షులు సీతారాo మధు, రాజేందర్, స్వామి, మల్లేశం, శంకర్, సంతోష్, లింగం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.