14-01-2026 07:25:25 PM
తూప్రాన్,(విజయ క్రాంతి): తూప్రాన్ పట్టణ టిఆర్ఎస్ నాయకులు అధ్యక్షుడు సతీష్ చారి మరియు అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది బిజెపి యువకులు పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేయడం జరిగింది. వారికి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తూప్రాన్ పట్టణం నుండి పెద్ద ఎత్తున బిజెపి నుండి యువకులు చేరడాన్ని స్వాగతించారు.
గతంలోని కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఆకర్షితులై చాలామంది బుధవారం బిజెపి కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాస శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు పూదరి యాదగిరి గౌడ్, పాల రమేష్ గౌడ్, అహ్మద్, తదితరులున్నారు.