12 August, 2026 | 10:37 PM

మల్యాలలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' యాత్ర & బైక్ ర్యాలీ.!

12-08-2026 09:36 PM

మల్యాల,(విజయక్రాంతి): మల్యాల బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో మల్యాల మండల కేంద్రంలో 'హర్ ఘర్ తిరంగా' యాత్ర బ్లాక్ చౌరస్తా నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వరకు భారీ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు,కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేయాలను సందేశాన్ని ప్రజలకు తీసుకెళ్ళేందుకు బైకు ర్యాలి  నివసిస్తున్నట్లు నాయకులు తెలిపారు. దేశభక్తి జాతీయత సమైక్యతను చాటుతూ మండలంలోని గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా ర్యాలీ  కొనసాగింది.

ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ సాయిని మల్లేశం, కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ.జిల్లా ఉపాధ్యక్షులు బింగి వేణు బొబ్బిలి వెంకటస్వామి యాదవ్.గుజ్జు శ్రీనివాస్. వన్ హాస్పిటల్ డా.మరి మహేష్ రెడ్డి.సర్పంచులు బోట్ల జయ ప్రసాద్. సంకుర్తి తిరుపతి. గడ్డం నడి మల్లేశం.చీకట్లో లత వక్కలభరణ మౌర్య. ప్రధాన కార్యదర్శులు పొన్నం సాయికుమార్.పిల్లి రాజశేఖర్.బీజవై మండల అధ్యక్షుడు గౌతమ్.కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు సామ మైపాల్.ఓబీసీ మోర్చా అధ్యక్షులు పరమేష్. ఉప సర్పంచులు. కొక్కెర  మల్లేశం,కందుల వినోద్.శంకర్.బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జులు కార్యకర్తలు పాల్గొన్నారు.