26 April, 2026 | 5:21 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

టిమ్ము పేరిట వేధింపులు!

10-03-2026 03:01 AM

డ్రైవర్ డ్యూటీతో పాటు కండక్టర్ డ్యూటీ చేయాలంటూ ఉన్నతాధికారుల ఒత్తిడి

  1. లేదంటే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామంటూ బెదిరింపులు
  2. ఆర్టీసీ డిపోలలో బలవంతపు డ్యూటీలు
  3. కొన్ని రోజుల క్రితం బోధన్‌లో డ్రైవర్ ఆత్మహత్యా యత్నం
  4. కోర్టు మెట్లు ఎక్కుతామంటున్న డ్రైవర్లు

బాన్సువాడ, మార్చి 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లపై టిమ్ము పేరిట ఉన్నతాధికారుల వేధింపులు అధికమవుతున్నాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. డ్రైవర్ డ్యూటీతో పాటు కండక్టర్ డ్యూటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. లేదంటే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు.

వేధింపులు తాళలేక కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డి పోకు చెందిన ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ డ్రైవర్ల పరిస్థితి ఇదే విధంగా ఉన్నదని తెలుస్తున్నది. ఉద్యోగం మానుకుంటే కుటుంబం రోడ్డున పడుతుందని, పని మాత్రం ఒత్తిడి మీద ఒత్తిడి పెడు తున్నారని ఆర్టీసీ డ్రైవర్‌లు ఆందోళన చెందుతున్నారు.

మానసిక క్షోభ పెడుతున్న అధికారులు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపో లో టిమ్ము పేరిట డ్రైవర్లపై వేధింపులు మితిమీరిపోతున్నాయి. డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవర్ డ్యూటీతో పాటు కండక్టర్ డ్యూటీ చే యాలని డిపోలోని అధికారులు బలవంతపు డ్యూటీలు వేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ సీనియార్టీ ప్రకారం జాబితాలో ఉన్న డ్రైవర్లు తప్పనిసరిగా కండక్టర్ డ్యూటీ చేయాలంటూ నిబంధనలు పెట్టడం పట్ల డ్రైవర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

డ్రైవర్లు కండక్టర్ డ్యూటీ చేయనని తెలిపితే వెంటనే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామంటూ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోలో కండక్టర్ డ్యూటీ చేయాలని ఆర్టీసీ అధికారులు బలవంతం చేయడంతో 15 రోజుల క్రితం ఓ డ్రైవర్ బస్సు డిపోలో ఉరేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తోటి సిబ్బంది గమనించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బాన్సువాడ ఆర్టీసీ డిపోలో సీనియర్ డ్రైవర్లు టిమ్ము నేర్చుకోవాలని అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

డ్రైవర్లను రెండు డ్యూటీలు చేయాలని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. వారానికి ఆరు రోజులు డ్యూటీ చేపిస్తున్నారనీ ఆ డ్యూటీలోనే అదనంగా డ్యూటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారుల తీరు మారకుంటే కోర్టు మెట్లు ఎక్కుతామని డ్రైవర్లు చెపుతున్నారు. 

డ్రైవర్లు టిమ్ము డ్యూటీ చేయాల్సిందే

బాన్సువాడ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సీనియార్టీ డ్రైవర్లు తప్పని సరిగా టిమ్ము విధులు నిర్వహించాల్సిందే. డ్రైవర్లు తప్పనిసరిగా వన్ మేన్ సర్వీస్ విధులను నిర్వహించే వి ధంగా అర్హులైన డ్రైవర్లకు శిక్షణ ఇస్తు న్నాం. విధులు నిర్వహించని డ్రైవర్లను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామ ని వస్తున్న ఆరోపణల్లో నిజంలేదు. 

 రవికుమార్, ఆర్టీసీ డీఎం, బాన్సువాడ