26 April, 2026 | 7:01 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

22 ఏళ్లుగా ‘నో స్మోకింగ్’ పోరాటం.. రఘునందన్‌కు జాతీయ హీరో అవార్డు

10-03-2026 09:59 AM

(నేషనల్ నో స్మోకింగ్ డే)

"చరిత్ర సృష్టిస్తా.!"అని అతడు అనుకోలేదు.

అతని నిస్వార్థ సేవ, అలుపెరుగని కృషి, పట్టుదల పొగాకుపై పోరాటంతో జాతీయ స్థాయిలో అత్యున్నత  "హీరో" అవార్డుకు ఎంపిక అయ్యేలా దోహదపడ్డాయి. "సార్ నో స్మోకింగ్ ప్లీజ్.!" అని 22 ఏళ్లుగా చేస్తూనే ఉన్న ప్రార్ధనకు యావత్ భారతం అవాక్కయింది. ఇలాంటి వారూ..ఉన్నారా?! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు రఘునందన్ గురించి ఉటంకిస్తూ..మేము రోగికి చికిత్స చేస్తున్నాం. "మాచన" మాత్రం సమాజానికి చికిత్స చేస్తున్నారని పేర్కొన్నారు. మిస్టర్ మాచన రఘునందన్ ద టుబాకో కంట్రోల్ "హీరో" అని పేర్కొన్నారు.

ఓ వ్యక్తి హీరో ఎలా అయ్యారు, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి.?!అని పలువురు వైద్య నిపుణుల బృందం పరిశీలించి, టుబాకో కంట్రోల్ హీరో అవార్డు ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన బహు కొద్ది మంది లో ఒకే ఒక్కడు గా నిలిచాడు. రఘునందన్ పొగాకు నియంత్రణ గురించి చేసిన కృషి గురించి, టుబాకో కంట్రోల్ హీరోగా ఎంపికకు ఎంతో సమయాన్ని కేటాయించారు. ఓ సామాన్యుడు,అసామాన్య కృషి భారత టుబాకో కంట్రోల్ లో హిస్టరీ సృష్టించింది.

అరుదైన వ్యక్తిత్వంతో ధూమపానం, పొగాకు నియంత్రణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మాచన రఘునందన్. ఒక ఉద్యోగిగా డిప్యూటీ తాసిల్దార్‌గా నౌకరీ చేస్తున్న వ్యక్తి విలాసవంతమైన జీవితాన్ని కాదని, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించడం దేశ చరిత్రలోనే ప్రథమం. వైద్య వృత్తికి సంబంధం లేకపోయినా, పొగాకు నియంత్రణ కోసం 22 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆయన కృషిని అంతర్జాతీయ వేదిక రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ (ఆర్ సిటిసి) గుర్తించి, ఆయనకు దేశం లో పొగాకు నియంత్రణ లో నే అత్యున్నత స్థాయి గౌరవం ఇచ్చింది. "హీరో" అవార్డును ప్రదానం చేసింది. 

సాధారణంగా ఈ అవార్డు వైద్యులకు మాత్రమే లభిస్తుంది. కానీ, రఘునందన్ తన నిస్వార్థ సేవతో, ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 15 మంది లో "మాచన" మాత్రమే వైద్యేతరుడు, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. మాచన రఘునందన్ అనే పేరు ఇకపై ఒక అధికారి పేరు మాత్రమే కాదు, పొగాకు మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక విప్లవ వీరుడి పేరు. ఆయన పొందిన "హీరో" అవార్డు కేవలం ఒక బహుమతి కాదు, నిస్వార్థ సేవకు లభించిన కిరీటం. రఘునందన్ సృష్టించిన ఈ "నిశ్శబ్ద విప్లవం" భవిష్యత్ తరాలకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఆయన కృషికి, అంకితభావానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

నార్కెట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

తెలంగాణ బడ్జెట్ 2026-27.. రూ.3.25 లక్షల కోట్లకు చేరే అవకాశాలు

ఇరాన్ యుద్ధ ప్రభావం.. దేశంలో గ్యాస్ సంక్షోభం!