6 July, 2026 | 1:20 AM

కులవృత్తిదారులపై అధికారుల వేధింపులను సహించేది లేదు

06-07-2026 12:25 AM

కరీంనగర్‌లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆవేదన

కరీంనగర్ జూలై 5, కార్పెంటర్లు, స్వర్ణకారులపై అటవీ శాఖ, పోలీసు అధికారుల వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో సమావేశం నిర్వహించారు.జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణుగోపాల చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మశ్రీ రఘునాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వృత్తి ఆధారంగా జీవనం సాగిస్తున్న కార్పెంటర్లు, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అటవీ శాఖ, పోలీసు అధికారుల వేధింపులపై సుదీర్ఘంగా చర్చించారు.సంప్రదాయ కులవృత్తులపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు సంఘటితంగా పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మశ్రీ రఘునాథ్ మాట్లాడుతూ, విశ్వకర్మ వర్గాలకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో కులవృత్తుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాములపర్తి శ్రీనివాస చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి పూర్ణాచారి, కరీంనగర్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, ఐక్య సంఘం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మూడపల్లి అనురాధ, జిల్లా సీనియర్ న్యాయవాదులు బెజ్జంకి శ్రీకాంత్,

చల్లోజు భూమాచారి, కనపర్తి వెంకటరమణ చారి, ముత్తోజు వేణు, కట్ట రమేష్, మంతెన శ్రీనివాస్, నందగిరి నరసింహాచారి, మంచిర్యాల శ్రీనివాస్, జగదీశ్వర చారి,జిల్లా మహిళా అధ్యక్షురాలు సామనపల్లి లక్ష్మి, రామోజు శారద, కరీంనగర్ మండల అర్బన్ అధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి, సంఘం ముఖ్య సలహాదారులు షానగోండ రవి, ఊకంటి ఓంకార్, వేములవాడ రవీందర్తో పాటు పలువురు కార్పెంటర్లు, స్వర్ణకారులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.