అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
06-07-2026 12:24 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ రూరల్, జూలై 5: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ 9వ వార్డులో లబ్ధిదారుల ఇంటి గృహప్రవేశంలో పాల్గొని నూతన వస్త్రాలు అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తోందన్నారు. అనంతరం తన వ్యవసాయ పొలంలోని బావిలో గంటపాటు ఈత కొట్టిన మంత్రి, ఆరోగ్యమే గొప్ప సంపద అని పేర్కొన్నారు. ప్రతిరోజూ యోగ, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలను అలవాటు చేసుకోవాలని సూచించారు.






