22 April, 2026 | 2:56 AM

హరీశ్‌రావు కొత్తకథలు

22-04-2026 01:16 AM
  1. బండారం బయపడే సరికి కాళేశ్వరం కథలు చెబుతున్నాడు 
  2. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్      

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): హరీష్ రావు బండారం బయటపడేసరికి కొత్త కథలు చెపుతున్నాడని, ఇప్పుడు కాళేశ్వరం కథలు చెపుతున్నాడని ప్రభు త్వ విప్ అద్దంకి దయాకర్ మంగళవారం ఒక ప్రకటన లో విమర్శించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అప్పీల్ కు పోతారు, కానీ ముందే ఎందుకు హడావుడి చేస్తున్నారని  నిలదీశారు.

కేసీఆర్ బహిరంగ పేరుతో ఒక వైపు డ్రామాలు చేస్తుంటే, హరీష్‌రావు బీజేపీ కథలు మొదలుపెట్టారని అన్నారు. 2029 వరకు బీఆర్‌ఎస్‌లో నే ఉంటానని చెప్పేదమ్ము హరీష్ రావుకు ఉందా? ఢిల్లీ రహాస్యం బయటపెట్టే సరికి కేసీఆర్ పొగిడే కార్యక్రమం హరీష్ రావు చేస్తున్నాడన్నారు.