15 July, 2026 | 5:09 AM

రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి : హరీశ్ రావు

04-07-2024 03:42 PM

హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి, ఎంఎల్ఏ హరీశ్ రావు తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి పార్టీ ఫిర్యాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు దుర్భర పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సమస్యలను పరిష్కరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.