రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా
04-07-2024 03:09 PM
హైదరాబాద్: అధికారికంగా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత కే కేశవరావు గురువారం రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ ధన్ ఖడ్ కు తన రాజీనామా లేఖను అందజేశారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారడంతో రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేశారు. రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ముందే ఆయన రాజీనామా చేశారు.







