15 July, 2026 | 5:01 AM

రాధాకిషన్ రావును అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

04-07-2024 04:17 PM

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పీటీ వారెంట్ పై రాధాకిషన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు జూబ్లీహిల్స్ పీస్ లో నమోదయిన నేపథ్యంలో రాధాకిషన్ రావు అరెస్టు చేశారు.

ఓ కంపెనీ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఆయన 150 కోట్ల కంపెనీని సెటిల్మెంట్ చేసి తక్కువ ధరకు మరొకరికి బలవంతంగా బెదిరించి ఇప్పించాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పిటి వారంట్ కింద రాధాకిషన్ రావును అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు.