27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

హనుమాన్ మాలధారణ స్వాముల బిక్షా కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ రావు

12-04-2025 07:01 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): హనుమాన్ విజయోత్సవం సందర్బంగా సిద్దిపేటలోని రామ రాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో జరిగిన హనుమాన్ మాలధారణ స్వాముల బిక్షా కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పల్లకి సేవలో హనుమాన్ స్వాములతో కలసి స్వామివారి పల్లకి మోశారు. అనంతరం ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... ఆంజనేయ స్వామి సీతా దేవిని శ్రీరామచంద్ర స్వామికి అప్పిగించిన సందర్బంగా హనుమాన్ సేవలు అమోఘమని శ్రీ రాముడు ఆంజనేయున్ని మేచ్చుకొని సన్మానం చేసిన రోజు హనుమాన్ విజయోత్సవం అని అన్నారు. హనుమాన్ సర్వ జగత్ రక్షకుడన్నారని పేర్కొన్నారు. హనుమాన్ స్వామి అనుగ్రహంతో అన్నింటా శుభం కలగాలని కోరుకున్నారు. హనుమాన్ విజయోత్సవ వేడుకల్లో భాగంగా బిక్షా కార్యక్రమంలో  హనుమాన్ మాలధారణ స్వాములతో కలసి పాల్గొన్నారు.