18 May, 2026 | 7:23 PM

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అంత గొప్ప ప్రదర్శన చేయలే: సీఎం రేవంత్

25-08-2024 11:31 AM

హైదరాబాద్: క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ ను వినియోగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.  ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అంత గొప్ప ప్రదర్శన చేయలేదని సీఎం వెల్లడించారు. 2028 ఒలిపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ఖేలో ఇండియా నిర్వహణను తెలంగాణకు ఇవ్వాలని కేంద్రానికి విన్నవించామని చెప్పారు. 2036లో హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని సీఎం వెల్లడించారు.