17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మూసీ సుందరీకరణ కాదు.. సీఎం రియల్ ఎస్టేట్ దోపిడీ

22-02-2026 05:29 PM

హైదరాబాద్: మూసీ సుందరీకరణ కాదని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ అని బీఆర్ఎస్ మజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం వేసే ప్రతి అడుగు వెనుకా భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని, పేదల ఇళ్లు కూల్చి.. బడాబాబులకు భూములు కట్టబెట్టే కుట్ర అని రేవంత్ రెడ్డి తెలిపారు. మంచి నీళ్లు ఇచ్చి పేదల బతుకులను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిలబెట్టారని గుర్తు చేశారు.

బుల్‌డోజర్లు పెట్టి పేదల జీవితాలను రేవంత్ రెడ్డి కూలగొడుతున్నారని, డీపీఆర్ లేదు, ఎఫ్టీఎల్ తేలలేదు, అనుమతులు లేవని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏ చట్టం ప్రాకారం ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తున్నారని, మధు పార్క్ అపార్ట్ మెంట్ కు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలన్నారు. బాధితుల పక్షాన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు చెప్పారు.