calender_icon.png 22 February, 2026 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును ఛేదించిన పోలీసులు

22-02-2026 02:52:40 PM

హైదరాబాద్: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని ఖమ్మం గ్రామీణ పోలీసులు తేల్చి చెప్పారు. నిందితుడు వేణుమాధవరెడ్డి సుపారి ముఠాతో హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. బొగ్గుల శ్రీనివాస్ జీఎస్టీ పర్మిషన్ ను మాధవరెడ్డి అనే వ్యక్తి వాడుకోవడంతో అధికారులు శ్రీనివాస్ జీఎస్టీ నోటీసులు ఇచ్చారు. ఒప్పందం మేరకు నగదు ఇవ్వాలని, జీఎస్టీని తిరిగి ఓపెన్ చేయాలని ఒత్తిడి చేయడంతో శ్రీనివాస్ ను హత్య చేసేందుకు మాధవరెడ్డి పథకం వేశాడు. ఈ నేపథ్యంలో మృతుడిని కారులో విజయవాడ తీసుకువెళ్తూ నార్కెట్ పల్లి వద్ద హత్య చేసి పాలేరు రిజర్వాయర్ లో కారు తోసేసి ప్రమాదంతగా చిత్రీకరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.