calender_icon.png 14 February, 2026 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాట్రిక్ కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి కే ఛాన్స్...?

14-02-2026 01:45:22 PM

విధేయతే ప్రామాణికం.. 

పోటీలో ఆశావాహులు.

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ లో వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రావడంతో చైర్పర్సన్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠంగా మారింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్ణయం మేరకు అభ్యర్థి ఎవరన్నది 

తేలనున్నట్టు సమాచారం. అయితే ప్రధానంగా విధేయతే ప్రామాణికంగా చైర్పర్సన్ అభ్యర్థి ఎంపిక జరగనుందని తెలిసింది. కౌన్సిలర్ గా హ్యాట్రిక్ విజయం సాధించిన 12వ వార్డు కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి కే చైర్ పర్సన్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది. గతంలో ఆమె అధికార, విపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై  అనర్ఘళంగా అధికారులను, పాలకులను నిలదీసి  గళమెత్తారు.

మున్సిపల్ పాలన తీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న నీరజకె చైర్ పర్సన్ పీఠం దక్కనుందని సమాచారం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో పాటు తాజాగా గెలుపొందిన మెజారిటీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు అధిష్టానానికి నీరజ పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ గా మొదటిసారి కౌన్సిల్లో అడుగుపెడుతున్న 27వ వార్డు నుండి గెలుపొందిన స్వరూప మరియు 11 వార్డు నుండి  మొదటిసారి గెలుపొందిన బంటు వేణు పేరు కూడా వినిపిస్తోంది.