ఓయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సికింద్రాబాద్, ఏప్రిల్ ౨౭ (విజయక్రాంతి): ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన వినీష్ (19) ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మైనింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
సోమవారం ఉద యం సుమారు 9 గంటల సమయంలో లేడీ స్ హాస్టల్ ముందు వినీష్ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, తీవ్ర గాయాలతో ఉన్న వినీష్ను ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటన కు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






