29 April, 2026 | 5:03 AM

నేడు హెచ్‌సీఏ టీ ట్వంటీ లీగ్ ఆవిష్కరణ

29-04-2026 02:05 AM

హైదరాబాద్, ఏప్రిల్ 28: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తన ప్రతిష్ఠాత్మక టీ ట్వంటీ లీగ్ టీజీ 20’ను బుధవారం నగరంలో ఘనంగా ఆవిష్కరించనుంది. ఈ లీగ్ రాష్ట్రంలోని దేశీయ క్రికెట్‌కు కొత్త దిశను చూపే కీలక అడుగుగా భావిస్తున్నారు. క్షేత్ర  స్థాయి నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ వరకు వారధిగా TG20 రూపుదిద్దుకుంటోంది. పారదర్శకత, పోటీ వాతావరణం, ప్రతిభా వికాసం అనే లక్ష్యాలతో ఈ లీగ్ రూపొందించబడింది. జిల్లా స్థాయి ఆటగాళ్లకు ఐపీఎల్ వంటి ఉన్నత స్థాయి వేదికల వరకు చేరుకునేలా ఈ లీగ్ రూపొందించినట్టు హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ రెడ్డి చెప్పారు. ఇటీవలఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ప్రక్రియకు కార్పొరేట్ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది.

తొలి సీజన్ జూన్‌జూలై 2026లో ప్రారంభం కానుంది. .అగ్రశ్రేణి లీగ్ల తరహాలో రూపొందించిన టీజీ20 ఆటగాళ్లకు అధిక స్థాయి పోటీ వాతావరణాన్ని కల్పిస్తూ, వారి ప్రతిభను మెరుగుపరచడానికి మరియు గుర్తింపు పొందడానికి సహాయపడుతుంది. ఈ టోర్నమెం ట్లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్ల మధ్య 32 మ్యాచ్లు నిర్వహించనున్నారు.. అన్ని మ్యాచ్‌లు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రౌండ్-రాబిన్ మరియు ప్లేఆఫ్ పద్ధతిలో జరుగుతాయి.హెచ్‌సీఏ అధికారులు టీజీ20 లీగ్‌ను కేవలం లీగ్‌గా కాకుండా, జిల్లా స్థాయి ప్రతిభను గుర్తించి, పెంపొందించి, ప్రదర్శించే ఒక సమగ్ర ప్రతిభా వేదికగా అభివర్ణించారు.