10-02-2026 02:03:52 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు కీలక వ్యక్తి అని ఆయనను 20 నెలలు అమెరికాలో దాచిపెట్టడం వల్లే ఈ కేసులో అరెస్టులు జరగలేదన్నారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ప్రభాకర్ రావును అమెరికా నుంచి భారత్‌కు తీసుకురావడానికి కేంద్రం సహకరించలేద న్నారు. సుప్రీంకోర్టు ఆరర్డ్‌తో ఇండియాకి రప్పించామన్నారు.
అరెస్టుల కోసం బావబామ్మరిది పోటీ పడుతున్నారని జైలుకు వెళ్లొస్తే ‘మేమూ సీఎం అవుతామని హరీశ్‌రావు, కవిత అనుకుంటున్నారు’అని సంచలన వ్యా ఖ్యలు చేశారు. అధికారం ఉన్నంత సేపు కేసీఆర్ ఫ్యామిలీ కలిసి ఉంటుందని, అధికారం కోల్పోయాక విడిపోయారని విమర్శించారు. అందరూ కలిసి ఉన్నప్పుడే వాళ్లని బొందపెట్టి సీఎం కూర్చీలోకి వచ్చానని సీఎం పే ర్కొన్నారు. ‘కవిత ఇష్యూతో నాకు సంబం ధం లేద’ అని అన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జమిలీ ఎన్నికలు ఉం టాయన్న సీఎం.. 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. మహిళల రిజర్వేషన్లు కూడా ఉంటాయని తెలిపారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే మనకు నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతానికి జిల్లాల కుదింపు, కొత్త జిల్లాలు ఇచ్చే ఆలోచన లేదని ముందు జనగణన, ఆ తర్వాత పునర్విభజన ఉంటుంద న్నారు.
తిరుమల లడ్డూ వ్యవహారం పక్క రాష్ర్టం అంశమని, మన ఆలయాల్లో విజ య డెయిరీ నెయ్యి వాడుతున్నామని సీఎం చెప్పారు. అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవిని ఎందుకు ఆమోదించలేదో గవర్నర్ చెప్పాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్‌కు ఎవరు సహరించకపోయినా ‘మేమే పూర్తి చేస్తాం’అన్నారు. తాను ఏ ఎన్నికనైనా సీరియస్‌గానే తీసుకుంటానని తెలిపారు. ‘మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలం. ఇది నేను చెప్పడం కాదు.. మీరే చూస్తారు’ అని సీఎం పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పట్టుకుని ఇదే కేసీఆర్ రండ అన్నారని, ఎవరు చేసుకున్నది వాళ్లకే తిరిగి వస్తుందన్నారు. మనిషి వికృతంగా మారినప్పుడు ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుందన్నారు. ‘రంజిత్‌రెడ్డిని మంత్రిని చేస్తా అని నేను చెప్పలేదు. నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు’ అని తెలిపారు. మున్సిపల్ మంత్రిగా నిధులు ఇచ్చి అభివద్ధి బాధ్యత రంజిత్‌రెడ్డికి ఇస్తానని చెప్పానని సీఎం స్పష్టత ఇచ్చారు.