10-02-2026 02:07:04 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : తెలంగాణలో మున్సిపల్, కార్పొరే షన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ర్యాలీలు బంద్ అయ్యాయి. మైకులు మూగబోయా యి. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి ప్రచారం లేకుండా ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం 13న ఉదయం 8 గంటల నుంచి కౌం టింగ్ ప్రారంభం కానుంది.
మొత్తం 116 ము న్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 2,996 వార్డులకు 14 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగతా వార్డులకు పోలిం గ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమైంది. 12,993 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ప్రతి కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్ల సంఖ్య 52.43 లక్షలు ఉండగా, అందులో మహిళా ఓటర్లు 26.80 లక్షలు, పురుష ఓటర్లు 25.62 లక్షలు ఉన్నా రు. ఈ సారి బ్యాలెట్ ద్వారానే ఓటింగ్ జరగనునంది.
అందుకోసం 16,301 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. పోలింగ్, కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసి నట్లు, 25 వేల మంది పోలీసులను బందోబస్తులో నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 19 వేలు గుర్తిం చగా, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 14 వేలు గుర్తించినట్లు చెప్పారు.
వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సీసీటీవీ మానిటరింగ్‌తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తయింది. స్ట్రాంగ్ రూమ్‌ల్లో 24 గంటలపాటు భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పట్టణాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని రాష్ట్ర ఈసీ ఆదేశాలు జారీ చేసింది.