అమెరికా ఆధిపత్యానికి ముకుతాడు!
ఫిరోజ్ ఖాన్ :
* 1979 నుంచి మాత్రం ఇరాన్- అమెరికా మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నా యి. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికాపై అక్కడి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ సమయంలో ఇరాన్ విద్యార్థులు అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించి మరీ సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు.
దశాబ్దాల నుంచి ప్రపంచ దేశాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అమెరికాకు ఇప్పుడు గల్ఫ్ గడ్డపై గట్టి సవాలు ఎ దురవుతున్నది. ప్రపంచ పోలీస్‌గా చలామణీ అవుతున్న అగ్రరాజ్యానికిప్పుడు ఇరాన్ బ్రేకులు వేస్తున్నది. వ్యూహాత్మక పంజా విసురుతోంది. ప్రపంచ దేశాలకు చమురు సరఫ రాలో ముఖ్యపాత్ర పోషించే హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించి అంతర్జాతీయ దృష్టిని తన వైపు తిప్పుకున్నది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఆ దేశం తన సైనిక, -రాజకీయ వ్యూహాలను బ లోపేతం చేసుకుంటున్నది. గతంలో కేవలం రక్షణకే పరిమితమైన ఇరాన్, ఇప్పుడు గల్ఫ్ దేశాల మధ్య తన ప్రాబల్యాన్ని పశ్చిమాసియాలో పెంచుకుంటున్నది. అమెరికా తన ఐదవ నౌకాదళాన్ని బహ్రెయిన్ కేంద్రంగా మోహరించినప్పటికీ, ఇరాన్ క్షిపణి వ్యవస్థ లు ఆ భద్రతా వలయాన్ని దాటుకుని లక్ష్యాలను ఛేదిస్తున్నాయి.
ఈ పరిణామాలు గల్ఫ్ దేశాలను తమ భద్రత కోసం కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా, ప్రాంతీయ శక్తు లతో రాజీ పడేలా చేస్తున్నాయి. ఇది ఒక దే శం సాధించిన విజయం మాత్రమే కాదు, అంతర్జాతీయ శక్తి సమీకరణాలను మార్చివేస్తున్న ఒక చారిత్రక పరిణామం.
సాంకేతిక యుద్ధ వ్యూహాలు
ఆధునిక యుద్ధాల్లో సాంకేతికత కీలక పా త్ర పోషిస్తున్న తరుణంలో ఇరాన్ తన స్వ దేశీ ఆయుధ సామర్థ్యాన్ని అసాధారణంగా పెంచుకుంది. అత్యున్నత గూఢచారి వ్యవస్థ లు, శాటిలైట్ పర్యవేక్షణ ఉన్నప్పటికీ అమెరికా కళ్లుగప్పి ఇరాన్ సాధించిన పురోగతి ప్రపంచ రక్షణ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. సుమారు 50 వేల డ్రోన్లను స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేయడం ఇరా న్ పట్టుదలకు నిదర్శనం.
అమెరికాకు చెంది న అత్యాధునిక ‘పేట్రియాట్’ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను సైతం బురిడీ కొట్టిస్తూ ఇరాన్ డ్రో న్లు గల్ఫ్ ఆకాశంలో గర్జిస్తున్నాయి. రష్యా వంటి అగ్రరాజ్యానికి సైతం ఆయుధాలను సరఫరా చేసే స్థాయికి ఇరాన్ ఎదగడం దా ని పారిశ్రామిక శక్తిని చాటుతున్నది. 2019 లో సౌదీ ఆరాంకో చమురు సదుపాయాల పై జరిగిన దాడులు గల్ఫ్ భద్రతా వ్యవస్థల బలహీనతను ప్రపంచానికి చాటిచెప్పాయి.
ప్రపంచ పోలీస్ నిఘా నీడలోనే ఇంతటి భా రీ ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం పెంటగాన్ వర్గాలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇరాన్ మేధస్సు ముందు పాశ్చా త్య నిఘా వ్యవస్థలు వెలవెలబోతుండటం గమనార్హం. అంతకుముందు ఎలా ఉన్నా.. 1979 నుంచి మాత్రం ఇరాన్- అమెరికా మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నా యి. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికాపై అక్కడి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.
ఆ సమయంలో ఇరాన్ వి ద్యార్థులు అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించి మరీ సిబ్బందిని బందీ లుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడం అమెరికా కు ఏమాత్రం ఇష్టంలేదు. తమ దేశ భద్రత కోసం అణు పరీక్షలు చేసి తీరతామని ఇరా న్ ఎప్పటికప్పుడు తెగేసి చెబుతూనే ఉన్నది. పశ్చిమాసియాలో ఇరాన్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం అమెరికాకు నచ్చడం లేదు. ఇరాన్ వెనక్కి తగ్గదు.. ఇది అమెరికాకు కంటగింపు.
వైట్ హౌస్ వ్యూహాలకు పద్మవ్యూహం
అమెరికా, పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా విధిస్తున్న ఆర్థికపరమైన ఆంక్షలు ఇరాన్‌కు శాపనార్థాలుగా కాక, వరాలుగా మారాయి. ఈ ఒతిళ్లు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కష్టాల్లోకి నె ట్టినప్పటికీ, అదే సమయంలో స్వదేశీ పరిశ్రమలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రే రేపించాయి. రక్షణ పరిశ్రమ, పారిశ్రామిక ఉత్పత్తిలో ఇరాన్ ప్రణాళికాబద్ధంగా స్వ యం సమృద్ధి సాధించింది. ఈ క్రమంలో ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్’ కీలక పాత్ర పోషిస్తూ దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తున్నది.
నాయకత్వ మార్పు ద్వారా ఇరాన్ బ లహీనపరచాలని, అమెరికా ప్రభుత్వం భావి ంచినా, నిబద్ధత గల ద్వితీయ శ్రేణి నాయకత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తు న్నది. అమెరికా కేవలం నాయకులను లక్ష్యం గా చేసుకుంటే, ఇరాన్ మాత్రం వ్యవస్థాగతమైన ప్లాన్-బీ అమలు చేస్తున్నది. దీనివల్ల ఒక నాయకుడు లేకపోయినా దేశ విధానం, పోరాట పటిమ ఏమాత్రం తగ్గడం లేదు. ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ వాణి జ్య మార్గాలను అన్వేషిస్తూ తన ఆర్థిక మనుగడను కాపాడుకోవడం ఇరాన్ వ్యూహ చతురతకు నిదర్శనంగా నిలుస్తుంది.
రష్యా-చైనా కూటమితో ఇరాన్ మైత్రి
ప్రపంచ రాజకీయాల్లో ఏర్పడుతున్న కొ త్త సమీకరణాలు పశ్రిమాసియాపై తీవ్ర ప్ర భావం చూపుతున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనాతో ఇరాన్ పెంచుకుంటున్న వ్యూహాత్మక సంబంధాలు అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని కట్టడి చేస్తున్నాయి. చైనా--ఇరాన్ దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం, రష్యాతో రక్షణ రంగ సహకారం గల్ఫ్ ప్రాంతంలో సరికొత్త పవర్ కేంద్రాలను సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ వ్యవస్థలో బహుళ ధ్రువాల రాజకీయాలు బలపడుతున్న నేపథ్యంలో, ఇరాన్ తన ప్రా బల్యాన్ని ప్రపంచ వేదికపై చాటుకుంటున్నది.
శాటిలైట్ కమ్యూనికేషన్స్, నిఘా స మాచారంలో రష్యా సహకారం యుద్ధ క్షేత్రంలో ఇరాన్కు పెద్ద ఆయుధంగా మారిం ది. గల్ఫ్ ప్రాంత భద్రతా సమీకరణాలు ఇక ఒక్క దేశం ఆధిపత్యంలోనే ఉండవని అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కీలకమైన వనరులు, వాణిజ్య మార్గాలు, రక్షణ ఒప్పందాల ద్వారా ఈ త్ర యం అమెరికా పట్టును సడలిస్తోంది. ప్రపం చ పోలీస్ ముందే ఈ కీలకమైన కూటము లు గల్ఫ్ భవిష్యత్తును నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి.
పరస్పర చర్చల వైపు
ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాలు తమ దౌ త్య విధానాల్లో తీసుకువచ్చిన మార్పులు ప్ర పంచాన్ని ఆశ్చర్యపరిచాయి. సౌదీ అరేబి యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ప్రాంతీయ స్థిరత్వం కోసం కొత్త మా ర్గాలను ఎంచుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ-ఇరాన్ సంబంధాలు బలోపేతం కావడం చారిత్రక మలు పు. గతంలో తీవ్ర ప్రత్యర్థులుగా ఉన్న దేశా లు ఇప్పుడు పరస్పర చర్చలకు ముందుకు రావడం అమెరికా ‘విభజించు- పాలించు’ వ్యూహానికి గట్టి దెబ్బ.
గల్ఫ్ రాజకీయాలు ఇక కేవలం సైనిక శక్తిపై కాకుండా దౌత్య చా తుర్యంపై ఆధారపడి సాగుతున్నాయి. ఇరా న్ తన హెచ్చరికల ద్వారానే కాకుండా, దౌత్య పరంగానూ గల్ఫ్ దేశాలను తన వైపు తిప్పుకోగలుగుతున్నది. అమెరికా ఆయుధాల కంటే ప్రాంతీయ మైత్రి మేలనే భావన అరబ్ దేశాల్లో బలపడుతుండటం ఇరాన్ దౌత్య విజయానికి నిదర్శనం.
ఈ మార్పు వల్ల గల్ఫ్ గడ్డపై యుద్ధ మేఘాలు తొలగి, పరస్పర సహకారంతో కూడిన కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం నీడన ఉన్న దేశాలు సైతం ఇప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.
అగ్రరాజ్యం గడగడ
పశ్చిమాసియా రాజకీయాల భవిష్యత్తు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. అమెరికా లోపల పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, చమురు ధరల సెగ వల్ల ట్రంప్ ప్రభుత్వం ‘ఎగ్జిట్ ప్లాన్’ గురించి ఆలోచించక తప్పని స్థితి నెలకొంది. అమెరికా తన సేనలను ఉపసంహరించుకుంటే, గల్ఫ్ గడ్డపై ఇరాన్ జెండా మరింత రెపరెపలాడటం ఖాయం. క్షిపణుల నుండి సైబర్ వార్ఫేర్ వరకు ఇరా న్ ప్రదర్శిస్తున్న అసాధారణ ప్రతిభ అగ్రరాజ్యానికి తీరని సవాలుగా మిగిలిపోయింది.
గల్ఫ్ రాజకీయాలు ఇక ఒక్కరి ఆధి పత్యం లో ఉండవు, కానీ.. ఇరాన్ ఆధిపత్యం లేకుం డా ఏ నిర్ణయమూ జరగదు. ఇరాన్ కే వలం సైనిక శక్తితోనే కాకుండా, వ్యూహాత్మక మేధస్సుతో ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తున్న అమెరికాను ఆత్మరక్షణలో పడేసింది. ఆంక్ష లు, హెచ్చరికల మధ్య ఒక దేశం తన ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదిగి ప్రపంచాన్ని శాసిం చవచ్చో ఇరాన్ నిరూపించింది. నిశ్శబ్దంగా మొదలైన ఇరాన్ ప్రస్థానం నేడు అగ్రరాజ్యాన్ని గడగడలాడించే స్థాయికి చేరింది.
వ్యాసకర్త సెల్ :9640466464




