30 April, 2026 | 7:08 PM

కార్మిక దినోత్సవం సందర్భంగా.. 'మేడే' వాల్ పోస్టల్ ఆవిష్కరణ

30-04-2026 05:43 PM

సిఐటియు జిల్లా నాయకులు శివ నారాయణ.   

మేడే దినోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున హాజరుకండి                               

జవహర్ నగర్,(విజయక్రాంతి): మేడే దినోత్సవ వేడుకలకు జవహర్ నగర్ పరిధిలోని కార్మికులు యువకులు ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున హాజరుకావాలని సిఐటియు జిల్లా నాయకులు శివ నారాయణ పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో గురువారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే వాల్ పోస్టర్ ఆవిష్కరణ(May Day Wall Poster) కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శివ నారాయణ హాజరై మాట్లాడుతూ మేడే సందర్భంగా జవహర్ నగర్ లోని సబ్బండ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకొని మే డే స్ఫూర్తిని కొనసాగించాలని తెలిపారు. మేడే దినోత్సవం కార్మికులకు ముఖ్యమైన పండుగ లాంటిదని ఇలాంటి వేడుకను కనీ విని ఎరగని రీతిలో నిర్వహించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నే సురేందర్, సిఐటియు నాయకులు నాగేశ్వర్, బీసీ డబ్ల్యూ జిల్లా నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.