7 April, 2026 | 2:39 AM

ఆరోగ్య విజ్ఞానం వికసించాలి

07-04-2026 12:35 AM

ఆరోగ్యం కోసం అందరం విజ్ఞానంతోనే మన ప్రయాణం 

సంపూర్ణ ఆరోగ్యం వైపు మన ప్రయాణం 

‘ఆరోగ్యం కోసం అందరం విజ్ఞానంతోనే మన ప్రయాణం’ నేడు ఏప్రిల్ 7 అంటే ప్ర పంచ ఆరోగ్య దినోత్సవం. ఈ ఏడాది ప్రపం చ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)‘టుగేదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్’ అనే నినాదాన్ని ప్రకటించింది. అంటే, కేవలం ఊహలతో కా కుండా, శాస్త్రీయ ఆధారాలతో కూడి న నిర్ణయాలు తీసుకోవడమే నేటి అత్యవసర అవ సరం. ముఖ్యంగా తప్పుడు సమా చారం వే గంగా వ్యాపిస్తున్న ఈ కాలంలో, సైన్స్ మీద నమ్మకాన్ని పెంచడం, ‘వన్ హెల్త్’ విధానాన్ని అనుసరించడం మన బాధ్యత.

2026 నినాదంలోని ముఖ్య ఉద్దేశ్యాలు:

1. శాస్త్రీయ నమ్మకం: ఆరోగ్య నిర్ణయా ల్లో సాక్ష్యాధారాలతో కూడిన విజ్ఞానాన్ని ప్రోత్సహించడం.

2. వన్ హెల్త్ : మానవుల ఆరోగ్యం అనే ది జంతువులు, మొక్కలు, మన పర్యావరణంతో విడదీయలేని విధంగా ముడిపడి ఉందని గుర్తించడం.

3. ప్రపంచ సహకారం: ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందదుకు అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం. 

వైద్యం వర్సెస్ ధ్యానం -ఒక శాస్త్రీయ విశ్లేషణ:

డబ్ల్యూహెచ్‌ఓ నినాదానికి అనుగుణం గా, ఆరోగ్యం విషయంలో మనం విజ్ఞానాన్ని, అంతర్గత శక్తిని వేరుగా చూడకూడదు.

వైద్యం: ఇది సైన్స్ అందించిన అద్భుత వరం. శరీరంలో తలెత్తే అత్యవసర సమస్య లను పరిష్కరించేందుకు, ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడానికి మందులు ‘హార్డ్వేర్ సపోర్ట్’లా పనిచేస్తాయి.

ధ్యానం, శ్వాస : ఇది మన శరీరంలోని ‘సాఫ్ట్వేర్ అప్డేట్’ వంటిది. ధ్యానం వల్ల మెదడులోని భయ కేంద్రం శాంతించి, విచక్షణ కేంద్రం బలపడుతుందని సైన్స్ నిరూపించింది. ఆరోగ్యం అనేది కేవలం వ్యాధి లేకపో వడం కాదు అది శారీరక, మానసిక, సామాజిక సమతుల్యత. నేటి ఆధునిక కాలంలో మ నం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు జీవనశైలి వ్యాధులు.

ప్రస్తుత ఆరోగ్య గణాంకాలు: ఒక హెచ్చరిక అండ్ ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధుల వంటి నా న్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వల్ల ఏటా 41 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఇది మొత్తం మరణాల్లో ౭౪%.

భారతదేశంలో: 

మన దేశం నేడు ‘ప్రపంచ డయాబెటిస్ రాజధాని’గా మారుతోంది. 10 కోట్లకు పైగా భారతీయులు డయాబెటిస్‌తో, 31 కోట్లకు పైగా  రక్తపోటుతో బాధపడుతున్నారు.

మానసిక ఆరోగ్యం: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు మానసిక ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో, మనం కేవలం మందులపై ఆధారపడలేం. వైద్యం, ధ్యానం ఈ రెండింటి కలయికే సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం.

1. సైన్స్ ఆధ్యాత్మికత: త్రివేణి సంగమం: 

ఆరోగ్యం అనేది మనం వేసుకునే మందుల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. మన శ్వాస, మన మెదడు, మన పొట్టలోని సూక్ష్మజీవుల మధ్య జరిగే అద్భుతమైన సంభాషణే ఆరోగ్యం. సైన్స్ ‘పదార్థాన్ని’ విశ్లేషిస్తే, ఆధ్యాత్మికత ’శక్తిని’ వివరిస్తుంది. ఈ రెండింటినీ కలిపే వారధి - శ్వాస.

2. న్యూరో-ఎండోక్రినాలజీ: శరీరంలోని హార్మోన్ల యుద్ధం: మన శరీరంలో నిరంతరం రెండు వ్యవస్థల మధ్య యుద్ధం జరుగుతుంటుంది.

ఒత్తిడి హార్మోన్లు: మనం ఆందోళనలో ఉన్నప్పుడు కార్టిసాల్, అడ్రినాలిన్ విడుదలవుతాయి. ఇవి దీర్ఘకాలం పెరిగితే రోగనిరో ధక శక్తి క్షీణించి, శరీరంలో ‘ఇన్ఫ్లమేషన్’ అంటే వాపు/మంట పెరుగుతుంది.

హ్యాపీ హార్మోన్లు : ధ్యానం,లయబద్ధమైన శ్వాస, ప్రేమ ద్వారా డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు విడుదలవుతా యి అని సైన్స్ నిరూపించింది. ఇవి శరీరానికి శాంతిని, స్వస్థతను ప్రసాదిస్తాయి.

3. మైక్రోబయోమ్: మన అసలైన యజమాని: ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం, మన పొట్టలో ఉండే ట్రిలియన్ల సూక్ష్మజీవు లు మన రోగనిరోధక శక్తికి 70%కంటే ఎక్కువ బలాన్నిస్తాయి.గట్ బ్రెయిన్ యాక్సి స్ ద్వారా మన పొట్టకు, మెదడుకు నేరుగా సంబంధం ఉంది. మనం ప్రశాంతంగా శ్వా స తీసుకున్నప్పుడు, వేగస్ నాడి ద్వారా పొ ట్టలోని సూక్ష్మజీవులకు సానుకూల సంకేతాలు వెళ్తాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు బలపడతాయి. ప్రకృతి సిద్ధ ఆహారంతో మంచి బ్యాక్టీరియా, జింక్ ఫుడ్డుతో చెడు బ్యాక్టీరియా పేగుల్లో వృద్ధి చెందుతుంది.

4. అమిగ్డాలా వర్సెస్ ప్రిఫ్రంటల్ కార్టెక్స్: 

రథం- సారథి పోలిక: మన మెదడులో భ యానికి కేంద్రమైన‘అమిగ్డాలా’గుర్రాల వం టిది.విచక్షణకు కేంద్రమైన ‘ప్రిఫ్రంటల్ కార్టె క్స్’ సారథి వంటిది. ధ్యానం చేయనప్పుడు రథం అనేది గుర్రాల ఇష్టానుసారం వెళ్తుంది.ధ్యానం చేసినప్పుడు సారథి (విచక్షణ) బ లపడి, గుర్రాలను అదుపులో ఉంచుతాడు.

ఆరోగ్యం కోసం 5 నిమిషాల ‘స్టాప్ ’ టెక్నిక్:

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ చిన్న అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.  

1. ఎస్ (స్టాప్) -ఆగండి: పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక్క క్షణం స్పృహతో ఆగండి.

2. టీ (టేక్ ఏ బ్రీత్ ) - శ్వాస తీసుకోండి: దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇది మీ అమిగ్డాలాను శాంతింపజేస్తుంది.

3. ఓ (ఆబ్జర్వ్)గమనించండి: మీ లోపల కలిగే కోపాన్ని లేదా భయాన్ని ఒక ‘సాక్షి’గా గమనించండి.

4. పీ(ప్రోసీడ్)ముందుకు సాగండి:ఇ ప్పుడు ప్రశాంతంగా మీ పనినిమొదలెట్టండి.

ముగింపు: మెడికేషన్ (మందులు) అనేది బయట నుంచి చేసే మరమ్మతు (హార్డ్‌వేర్ సపోర్ట్). ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణకు అవసరం. మెడిటేషన్ (ధ్యా నం) అనేది లోపలి నుంచి జరిగే పునర్నిర్మా ణం (సాఫ్ట్‌వేర్ అప్‌డేట్). నిజమైన స్వస్థత (హీలింగ్) ఈ రెండింటి కలయిక వల్లే సా ధ్యం. మీ శ్వాస లయబద్ధంగా ఉంటే, మీ మెదడు, పొట్ట ప్రశాంతంగా ఉంటుంది.

డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని

చైర్మన్, శ్వాస హాస్పిటల్ అండ్ ఫౌండేషన్