29 July, 2026 | 6:05 PM

Breaking News

గ్రామపంచాయతీ రికార్డులు స్వాధీనం విచారణ   •   బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక   •   వందేళ్ల మామిడి చెట్టు.. నెలా మట్టం   •   అర్హులైన ప్రతి ఓటరు పేరు... ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడండి   •   గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం   •   ప్రసూతి తల్లులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందించాలి   •   ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన సింగరేణి వైసీఓఏ లేడీస్ క్లబ్   •   మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ   •   ఆర్మూర్ లో వన మహోత్సవం   •   కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలేటి ఆనందరావు నియామకం   •  

వేములవాడలో కౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్

20-05-2026 12:13 AM

వేములవాడ, మే 19 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మున్సిపల్ పరిధిలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ను బస్తీ దవాఖానలో మున్సిపల్ కమిషనర్ లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కౌమార బాలికలకు అనీమియా, డయాబెటిస్, బీఎంఐ తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బాలికలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఏఓ ఫసత్ అలీబేగ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ నయీం, సీడీపీఓ సౌందర్య, టీఎంసీ భూలక్ష్మీ, బస్తీ దవాఖాన వైద్యులు, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, మెప్మా సిఎల్‌ఆర్పీలు, ఆర్పీలు పాల్గొన్నారు.