22 June, 2026 | 3:02 AM

యోగాతో ఆరోగ్యం.. జీవితంలో ఆనందం..

22-06-2026 12:00 AM

జుక్కల్ మాజీ హాట్రిక్ ఎమ్మెల్యే షిండే

బిచ్కుంద జూన్ 21 (విజయ క్రాంతి): యోగాతో ఆరోగ్యం బాగుంటుందని, తద్వారా జీవితం ఆనందంగా ఉంటుందని జుక్కల్ మాజీ హాట్రిక్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం ప్రాచీన భారతీయ కళ అయిన యోగాను ప్రతిరోజూ అలవాటు చేసుకోవడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. మున్నూరుకాపు సంఘంలో సహజ సిద్ధ యోగ సమితి బిచ్కుంద ఆధ్వర్యంలో నిర్వహించినారు. యోగ కార్యక్రమం ఘనంగా జరిగింది.

యోగ అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద అని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగను భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగ ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో సహజ సిద్ధ యోగ సమితి సభ్యులు, మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు, యువకులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతరం నిర్వాహకులు ఆయనకు శాలువతో ఘనంగా సన్మానించారు. యోగ దినోత్సవాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను మాజీ ఎమ్మెల్యే అభినందించారు.