యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
మహాదేవపూర్‌లో ఘనంగా యోగా దినోత్సవం
మహాదేవపూర్, జూన్ 21 (విజయక్రాంతి): ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మహాదేవపూర్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ హసీనా భాను, ఉపసర్పంచ్ తుంగ ల శ్రీజా ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశం ఆరోగ్యవంతంగా ఉండాలంటే పిల్లల నుండి పెద్దల వరకు ప్రతీ వ్యక్తి రోజూ కనీసం ఒక అరగంట యోగాస నాలు, ధ్యానం చేస్తే ఆరోగ్యాంగా ఉంటారని. ఏలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యం గా ఉంటారని అన్నారు. యోగా హసనాలతో వ్యక్తి ఆరోగ్యాంగా ఉంటారని వారు అన్నారు.
ఈ సందర్బంగా వార్డు సభ్యులు గడ్డం స్వామి మహమ్మద్ బిన్ అలీ, అస్రార్ ఖురేషి యోగాసనాలు వేశారు. బాలుర పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి యోగా వల్ల మనకు కలిగే ప్ర యోజనాలను విద్యార్థులకు వివరించారు. బాలికల పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యోగా దినోత్సవ ప్రాధాన్యత వివరించారు. ముందస్తుగా ఉపాధ్యాయులు రాజయ్య, మధు, పిడి పూర్ణిమ, సూర్యనమస్కారాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్ కుమార్, లీలారాణి, ఆంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






