22 June, 2026 | 2:59 AM

నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి: బోధన్ ఎమ్మెల్యే

22-06-2026 12:00 AM

బోధన్,జూన్21(విజయ క్రాంతి) బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో జాతీయ నునె గింజల పధకం ఆధ్వర్యంలో బికినెల్లి, హంగార్గ గ్రామాల సోయాబీన్ జాతీయ నూనె గింజల పథకం  క్రింధ ఏకచక్రపుర కిసాన్ ఎఫ్పిఓ ద్వారా వ్యవసాయ శాఖ మరియు కృషి విజ్ఞాన్ కేంద్రం రుద్రూర్ వరి అద్వర్యం లో భిక్నెల్లి మరియు హంగర్గా గ్రామ రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 100% సబ్సిడీ సోయాబీన్ విత్తనాలు పంపిణీ కార్యక్రమం సొసైటీ కల్దుర్కి లో నిర్వాహించారు .

100% విత్తనాలు పంపిణీ ఆదివారం రోజున కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి గ్రామాలను సోయాబీన్  100% విత్తనాలు పంపిణీ నిర్వహించారు. అనంతరం పి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 30 తారీఖు రోజున ముఖ్యమంత్రి ఖమ్మంలో రైతుల కొరకు ప్రకటన చేస్తారు అందరూ ఉంటుందన్నారు. నేను హైదరాబాదులో ఐదు గంటలు తిరిగి చెరువులు కుంటలు తిరిగి పరిశీలించాను. పతి రైతు బోర్ వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే ఇలాంటి ఇబ్బందులు రావు అన్నారు. ఈ ఉచిత 100% సబ్సిడీ సోయాబీన్ విత్తనాలు ఒక వర్షం పడ్డ తర్వాత ఎత్తుకుంటే బాగా వస్తుంది అన్నారు. జూలై 20 వరకు వేసుకోవచ్చు అన్నారు.

ఐజి తో మాట్లాడాను నకిలీ విత్తనాలు అమ్మ కూడా అని తెలిపాను అమ్మిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ వారికి ఆదేశించాను. అదిలాబాద్ ఎస్పీ అఖిల్ విత్తనాల వారిపై కొరడా చూపించినట్టు నిజాంబాద్ పోలీసులు కూడా నక్కలు విత్తనాలు అమ్మిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వ్యవసాయ ఏకచక్రపుర కిసాన్ ఎఫ్ పి ఓ చైర్మన్ పుష్ప, సీఈఓ మహేందర్, ఎఫ్పిఓ డైరెక్టర్లు, కె వి కె రుద్రూర్ శాస్త్రవేత్త డాక్టర్ ఇందుధర్ రెడ్డి  ,నాబ్కాన్స్ కోఆర్డినేటర్ థామోస్ మోడీ  శాఖ అధికారులు సంతోష్ కుమార్, వ్యవసాయ శాఖ ఏ,డి శ్రీనివాసరావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ అకాడమీ చైర్మెన్ తహర్ బీన్, పిసిసి డెలిగేట్ గంగా శంకర్, బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగేశ్వరరావు. కల్దురికి సొసైటీ చైర్మన్ శరత్ డైరెక్టర్లు రైతులు తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.