10 May, 2026 | 1:22 AM

వ్యాయామంతో ఆరోగ్యం

23-06-2024 12:05 AM
  • కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్, జూన్ 22: కంటోన్మెంట్ నాలుగో వార్డు పరిధిలోని గాంధీ కాలనీ లో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్‌ను ఎమ్మెల్యే శ్రీగణేష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. అనంతరం బస్తీవాసులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.