17 July, 2026 | 5:49 AM

మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు

23-06-2024 12:05 AM
  • సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి, జూన్ 22 (విజయక్రాంతి): మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గంజాయి సాగు, అక్రమ రవాణా జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కలిపించాలని తెలిపారు. యువత డ్రగ్స్‌తో పాటు గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ తదితర వాటికి దూరంగా ఉండాలని సూచించారు. బెల్ట్ షాపులపై ఫిర్యాదులు వస్తే వెంటనే మూసివేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి నవీన్ చంద్ర, డీఎంహెచ్‌వో డాక్టర్ గాయత్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వసంతకుమారి, డీఈ వో వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.