8 May, 2026 | 7:09 AM

టీవీ వార్తలు వద్దు.. నెట్టింటి వార్తలే.. ముద్దు

10-09-2024 12:59 PM

లండన్: వార్తలను వివిధ పత్రికలలో చదివే వారికంటే టెలివిజన్ లను చూసే వారి సంఖ్య ఎక్కువ. ఇలా వార్తలను టీవీలో చూసే అలవాట్లు సైతం తగ్గి నెట్టింట చూసేవారు పెరిగి.. ఏకంగా  75% మంది  ప్రజలు నెట్టింట వార్తలు వీక్షిస్తున్నారని యూకే బ్రాడ్ కాస్ట్ రెగ్యులేటరీ సంస్థ ఆఫ్కామ్ Ofcom తన వార్షిక సర్వేలో వెల్లడించింది. ఈ మేరకు యూకే బ్రాడ్ కాస్ట్ రెగ్యులేటరీ సంస్థ ఆఫ్కామ్ చేసిన వార్షిక సర్వేలో ఆన్‌లైన్ వార్తలు చూసే ప్రజల జనాభా  మొదటిసారిగా టెలివిజన్‌ను అధిగమించింది. ఈ పరిశోధనలో 71% మంది ప్రజలు వార్తల కోసం ఆన్‌లైన్ సేవలను ఉపయోగించారని, 70% మంది టీవీ న్యూస్ బులెటిన్‌లను చూస్తున్నారని యూకే బ్రాడ్ కాస్ట్ రెగ్యులేటరీ సంస్థ ఆఫ్కామ్ Ofcom సర్వే వెల్లడించింది. గత సంవత్సరంలో, ఆన్‌లైన్ న్యూస్ సో ర్స్ ఇచ్చే ఏజెన్సీలు 68% నుండి 71%కి పెరిగాయి, సోషల్ మీడియా కూడా 47% నుండి 52%కి పెరిగింది. 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సున్న  కుర్ర వాళ్లు,  వార్తల కోసం  82% మంది  సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. ఈ మేరకు ఆఫ్కామ్ Ofcom సర్వే  పేర్కొన్న ఆన్‌లైన్ న్యూస్ సో ర్స్ ల జాబితాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ లు ఉన్నయి. రెండవ అతిపెద్ద   న్యూస్ సో ర్స్  గా  40% ప్రజలు మెటా వార్తల కోసం   వీక్షిస్తున్నామని  సర్వేలో చెప్పారు. కాగా ఇప్పటికీ ఆన్‌లైన్ న్యూస్ సో ర్స్ గా BBC ని వార్తల కోసం 68% మంది ప్రజలు వీక్షిస్తున్నారని ఆఫ్కామ్ Ofcom సర్వే పేర్కొన్నది.