డీసీసీ పదవులు పొందిన వారికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సన్మానం
సనత్‌నగర్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో సనత్‌నగర్ నియోజకవర్గం బీ బ్లాక్‌కు చెందిన నాయకులు పలు పదవులకు నియమితులవడం పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. హన్మంత్ రావు వైస్ ప్రెసిడెంట్‌గా, శ్రీకాంత్ గౌడ్, ఎస్‌ఎస్ రావు, రాజు యాదవ్ జనరల్ సెక్రటరీలుగా, ఖమర్ హమీద్, రోహిత్ ఆనంద్, రజినీకాంత్, సాయి గౌడ్ సెక్రటరీలుగా, పద్మా రాణి, వినోద్ సింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా, ప్రతాప్ నాయక్ స్పోక్స్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా బ్లాక్ నాయకులు వారిని ఘనంగా సన్మానించారు. పార్టీకి అంకితభావంతో సేవలందించిన నాయకులను అభినందిస్తూ, వారి కృషిని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, కొత్త బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పదవులు పొందిన నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ మార్గదర్శకత్వం, ప్రోత్సాహంతోనే తమకు ఈ అవకాశాలు లభించాయని తెలిపారు.
ఆమె నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో డాక్టర్ కోట నీలిమ పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ కోట నీలిమ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, ప్రజల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకునేందుకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్‌కు, అలాగే సన్మానం చేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.




