2 June, 2026 | 11:39 AM

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని సహించేది లేదు

02-06-2026 11:09 AM

అమరవీరుల త్యాగ ఫలితమే.. తెలంగాణ రాష్ట్రం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆగ్రహం.

తెలంగాణ, ఆంధ్ర ,అన్నదమ్ముల.. కలిసుందాం.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

తుంగతుర్తి (విజయ క్రాంతి): తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యలపై ఏమాత్రం సహించేది లేదని  ఎమ్మెల్యే మందుల సామెల్(MLA Mandula Samuel) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు కొట్లాడి ఎంతోమంది అమరవీల త్యాగ ఫలితంగా, సోనియా గాంధీ కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిధులు, నియామకాలు ఉద్యోగాల కోసమే ప్రత్యేకంగా రాష్ట్రము ఏర్పాటు చేసుకొని అభివృద్ధిలో సాగుతుందని అన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో లక్షలాది మంది ఆంధ్ర ప్రజలు ఉన్నప్పటికీ ఐక్యంగా ఉంటూ అభివృద్ధి కొనసాగుతుందని, తెలంగాణతో కోనసీమ ఎండిపోతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం పై విషం కక్కడం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారని, తెలంగాణ ఆత్మగౌరాణి దెబ్బతీయాలని చూస్తే తెలంగాణ ప్రజలు సహించరని ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని, రాష్ట్రాల విభజనలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని వాటినిపరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. నియోజకవర్గంలో రామన్న రోజులు 2500 పైచిలుకు ఇందిరమ్మ ఇల్లు  మంజూరు అవుతాయని, పేద ప్రజల సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, తాసిల్దార్ దయానందం, మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, నల్లు రామచంద్రారెడ్డి, రామచంద్రయ్య, మాచర్ల అనిల్, గంగరాజు యాదవ్, దాసరి శీను, పోలపాక రామచంద్రు, సుధాకర్ గౌడ్, మహేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.