2 June, 2026 | 10:41 AM

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

02-06-2026 10:09 AM

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు 

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) శుభసందర్భంగా ముఖ్యమంత్రిఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘన నివాళులర్పించారు.  పరేడ్ మైదానంలో తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. పరేడ్ గ్రౌండ్ లో సీఎం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాల్లో  మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకావిష్కరణ చేశారు.

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తూ, ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని,  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.